royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana › టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 ✈ in @ ✉
royalpost.co.in 06 Oct 2026, 2:40 am
Date of Publish : 19 Aug 2026, 7:47 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 15 💬 0
Latest News

టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం…

టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం…

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రం డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.
పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, జిల్లా, నగర స్థాయిల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ కేంద్రాల ద్వారా కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం, పాన్ కార్డు వివరాల్లో సవరణలు, బస్సు, రైలు, విమాన టికెట్ల బుకింగ్, బ్యాంకు నగదు బదిలీలు, ఆధార్ ఆధారిత చెల్లింపు సేవలు, మైక్రో ఏటీఎం సేవలు, నగదు డిపాజిట్లు, హెల్త్, బైక్, కార్ ఇన్సూరెన్స్ సేవలు, వివిధ బిల్లుల చెల్లింపులు వంటి ఆన్‌లైన్ సేవలను ప్రజలకు అందించవచ్చని పేర్కొన్నారు.
అలాగే 100కు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు నమోదు, 100కు పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆమోదించిన స్కిల్ టెస్ట్ సర్టిఫికేషన్లకు నమోదు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్టులకు నమోదు వంటి సేవలను కూడా అందించవచ్చని తెలిపారు.
ప్రజలకు వివిధ ఆన్‌లైన్ సేవలను అందించడం ద్వారా కేంద్ర నిర్వాహకులు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వెంకట్ రెడ్డి వివరించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు www.tsevaonline.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఫోన్: 8179955744
వెంకట్ రెడ్డి
డైరెక్టర్, టీ-సేవ ఆన్‌లైన్ స్కిల్ కేంద్రం, హైదరాబాద్