royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaజిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకై ఐక్యంగా కదులుదాం– ఈనెల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 10:04 pm
Date of Publish : 19 Aug 2026, 5:29 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 4 💬 0
Latest News

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకై ఐక్యంగా కదులుదాం– ఈనెల 29, 30, 31తేదీల్లో భువనగిరి నుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర– 31న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయండి– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు…

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకై ఐక్యంగా కదులుదాం– ఈనెల 29, 30, 31తేదీల్లో భువనగిరి నుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర– 31న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయండి– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు…

--

  రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్భు 19/ వనగిరి జిల్లా నూతనంగా ఏర్పడి దశాబ్ధం అవుతున్న ఇంతవరకు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పురోగతి సాధించలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ విమర్శించారు. బుధవారం పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం గ్రామంలో సీపీఎం గ్రామ శాఖ సమావేశం గుర్రం రామచంద్రారెడ్డి అధ్యక్షతన  జరుగక ఈ సమావేశంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం అని అన్నారు. లక్షల మంది చిన్న, సన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయ ఆధారంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సాగుకు కీలకమైన బస్వాపురం, గంధమల్ల, చర్లగూడెం లాంటి బహుళార్ధక సాదక ప్రాజెక్టులు నిధుల కొరత వల్ల ఏళ్ల తరబడి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు తక్షణం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చిన్న నీటి కాలువలైన బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డి పల్లి, పిల్లాయిపల్లి కాలువల పూర్తికి కూడా నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఈనెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి అంబేద్కర్ స్టాచ్ నుండి హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి వేలాది మందితో 31వ తేదీన మహా ధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలు రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ పిలుపునిచ్చారు. పాదయాత్ర ప్రారంభ సభకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ  శాసనమండలి మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, మహాధర్నకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, మండల కార్యదర్శివర్గ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు గ్రామ నాయకులు ముద్దం సత్తయ్య, గుర్రం రామచంద్రారెడ్డి, పగిళ్ల వేణుగోపాల్ రెడ్డి , మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.