రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 18/ వందేమాతరం, జనగణమన జాతీయ గీతాలను గౌరవించే గొప్ప సంస్కృతిని దేశానికి నేర్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పార్టీ పట్టణ సేవాదళ్ నాయకులు స్పష్టం చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఒక కార్యక్రమం నిర్వహించారు. సోనియా గాంధీ వందేమాతరం పాడొద్దన్నట్లుగా ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఈ సందర్భంగా నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబానికి చెందిన సోనియా గాంధీ ఈ దేశంలోనే నివసిస్తూ, 2004, 2009లలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా పదవులను త్యాగం చేశారని గుర్తుచేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజలను గౌరవిస్తూ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం (RTI) వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ లక్షలాది మంది ఉన్న బహిరంగ సభల్లో సైతం వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించిన చరిత్ర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలదని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట సమయం నుంచే ఈ జాతీయ గీతాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.
పదవులు, సీట్ల కోసం దేవుడు, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ, జాతీయ గీతాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న బీజేపీ నకిలీ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, యువకులు, మహిళలు ఖండించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బెండె లాల్ రాజు, పిట్టల బాలరాజు, పడిగెల ప్రదీప్, డాకూరి ప్రకాష్, సీనియర్ సిటిజన్ నాయకులు పద్మారెడ్డి, శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, బుచ్చన్న, ముత్తిరెడ్డి, నక్క పాండు, దిడ్డి కాడి నర్సింగ్, శ్రీనివాస్, శ్రీధర్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.