వలిగొండ,ఆగస్టు18(రాయల్ పోస్ట్ న్యూస్ ): మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు గంధమల్ల గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాధారణ కుటుంబంలో జన్మించి తన ధైర్యం, పట్టుదల, పోరాట స్ఫూర్తితో ప్రజల కోసం ఉద్యమించిన గొప్ప యోధుడని అన్నారు. మొఘల్ పాలనలో ప్రజలు అన్యాయం, అణచివేతకు గురవుతున్న సమయంలో పాపన్న గౌడ్ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారని తెలిపారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
పాపన్న గౌడ్ కేవలం రాజుగా మాత్రమే కాకుండా ప్రజల మనసులను గెలుచుకున్న నాయకుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. కులం, వర్గం అనే తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం అందించాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారని తెలిపారు. ఆయన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగె లింగస్వామి, ఉపసర్పంచ్ జయ, బొడిగె సాయిలు, బొడిగె నరసింహ, బొడిగె ఆనంద్, బాలగోని నరసింహ, బొంగు నరసింహ, మునుకుంట్ల రమేష్, పబ్బు నరసింహ, బిక్షపతి, శ్రీను, కిషన్, రాఘవేందర్, వెంకటేష్, పెంటయ్యతో పాటు గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.