royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaభువనగిరి, ఆలేరు ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం…ఎమ్మెల్యే కుంభం అనిల్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 7:31 pm
Date of Publish : 18 Aug 2026, 8:55 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 5 💬 0
Latest News

భువనగిరి, ఆలేరు ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం…ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి, ఆలేరు ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం…ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి జిల్లా ప్రతినిది
రాయల్ పోస్ట్ న్యూస్ , ఆగస్టు 18

భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.210 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్‌ నుంచి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటిని తరలించే పైప్‌లైన్ నిర్మాణ పనులను మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనపూర్ గుట్ట వద్ద పైప్ లైన్ పనులను పరిశీలించారు.
ఘనపూర్ గుట్ట వద్ద జరిగిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పైప్‌లైన్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టుకు అవసరమైన 4.5 కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే పొందిందని ఎమ్మెల్యేలు తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూ.210 కోట్లతో ఈ ప్రతిష్టాత్మక పైప్‌లైన్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
మల్లన్నసాగర్‌ నీటిని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తీసుకురావడం ద్వారా వేలాది కుటుంబాలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని,పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.
ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్మర్పన్ శిరీషాకృష్ణారెడ్డి,కౌన్సిలర్లు భువనగిరి, ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరద జిల్లా అధికారులు సి ఈ రాంచంద్రనాయక్, ఎస్ ఈ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు
ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.