royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి.. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:34 pm
Date of Publish : 16 Aug 2026, 8:38 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి..

మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి..

వలిగొండ ఆగస్టు16 రాయల్ పోస్ట్ న్యూస్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరిపై కేసులు నమోదు చేసి రెండు మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే 10 వేల వరకు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.