royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaరైతు నుంచి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు…..ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ ఆవిష్కరణలో… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 5:34 pm
Date of Publish : 16 Aug 2026, 8:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 6 💬 0
Latest News

రైతు నుంచి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు…..ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ ఆవిష్కరణలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రైతు నుంచి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు…..ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ ఆవిష్కరణలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

హైదరాబాద్, ఆగస్టు 16 రాయల్ పోస్ట్ న్యూస్ / రైతుల నుంచి నేరుగా నాణ్యమైన కూరగాయలు, పండ్లను సేకరించి ప్రతి కుటుంబానికి తాజా, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్‌ను పెద్దమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, ప్రముఖ సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం నాణ్యమైనది, తాజాది, పరిశుభ్రమైనదిగా ఉండాలి. పొలం నుంచి నేరుగా కమ్యూనిటీ కుటుంబాలకు తాజా కూరగాయలు, పండ్లను అందించాలనే సంకల్పంతో ఏరువాక ఫార్మ్స్ ఏర్పాటు కావడం అభినందనీయమని” అన్నారు.
స్థానిక రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను నేరుగా సేకరించి వినియోగదారులకు అందించడం ద్వారా రైతు–వినియోగదారుల మధ్య దూరాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. “రైతుకు న్యాయమైన ధర–వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి” అనే సూత్రం ఏరువాక ఫార్మ్స్‌కు ప్రధాన బలంగా ఉండాలని సూచించారు.
ఇతరుల కంటే తక్కువ ధరకు విక్రయించడం ఒక్కటే లక్ష్యం కాకూడదని, నాణ్యత, తాజాదనం, పరిశుభ్రత, పారదర్శకత విషయంలో ప్రత్యేకతను చాటుకోవాలని దుండ్ర కుమారస్వామి అన్నారు. రైతు బలపడితే వ్యవసాయం బలపడుతుందని, వ్యవసాయం బలపడితే దేశ ఆహార భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు.
ఏరువాక ఫార్మ్స్ లోగో రైతు ఆత్మగౌరవానికి, స్వచ్ఛమైన ఆహారానికి భరోసాకు, వినియోగదారుల నమ్మకానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. రైతుల నుంచి నేరుగా సేకరించిన సీజనల్ పండ్లు, కూరగాయలను పరిశుభ్రమైన విధానంలో కుటుంబాలకు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించవచ్చన్నారు.
“పొలం నుంచి కుటుంబానికి… రైతు కష్టం నుంచి ఆరోగ్యకరమైన ఆహారం వరకు—ఇదే ఏరువాక ఫార్మ్స్ లక్ష్యం” అని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు.
కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ దక్షిణ రాష్ట్రాల అధ్యక్షుడు కుర్మారావు, జాతీయ బీసీ దళ్ సంగారెడ్డి అధ్యక్షుడు రక్షణ, ఏరువాక ఫార్మ్స్ పర్యవేక్షణ, భాగస్వామి ఏడుకొండలు, పద్మ తదితరులు పాల్గొన్నారు.