వలిగొండ,ఆగస్టు16 రాయల్ పోస్ట్ న్యూస్ / : మండలంలోని పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన రాయగిరి శిరీష, వెంకటేష్ గౌడ్ దంపతుల కుమార్తె శ్రీజ వివాహ వేడుకలు ఆదివారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ మహోత్సవానికి ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరుల కుటుంబ సభ్యులకు 10 వేల నగదును పెళ్లి కానుకగా అందజేశారు.