royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaశివన్నగూడెం ప్రాజెక్ట్ పూర్తికి గడువు ప్రకటించాలి– దశాబ్దం గడిచిన పురోగతి… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 4:21 pm
Date of Publish : 16 Aug 2026, 5:29 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 2 💬 0
Latest News

శివన్నగూడెం ప్రాజెక్ట్ పూర్తికి గడువు ప్రకటించాలి– దశాబ్దం గడిచిన పురోగతి లేదు– సాగునీటిపై ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనలేదు– రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి– పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సీపీఎం చలో హైదరాబాద్– ఆగష్టు 29, 30 భువనగిరి నుండి పాదయాత్ర హైదరాబాద్ కు పాదయాత్ర– ఆగష్టు 31న ఇందిరా పార్క్ ముందు మహా ధర్నా– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యండి జహంగీర్

శివన్నగూడెం ప్రాజెక్ట్ పూర్తికి గడువు ప్రకటించాలి– దశాబ్దం గడిచిన పురోగతి లేదు– సాగునీటిపై ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతనలేదు– రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలి– పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సీపీఎం చలో హైదరాబాద్– ఆగష్టు 29, 30 భువనగిరి నుండి పాదయాత్ర హైదరాబాద్ కు పాదయాత్ర– ఆగష్టు 31న ఇందిరా పార్క్ ముందు మహా ధర్నా– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి యండి జహంగీర్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 16/ డిండి ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా శివన్నగూడెం ప్రాజెక్టు లోకి నీరు తెచ్చి కరువు పీడిత ప్రాంతమైన మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగు నీరు అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆదివారం సీపీఎం నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి రాచకొండ లిఫ్టి ఇరిగేషన్ ద్వారా నారాయణపూరం, చౌటుప్పల్ మండలాల్లోని రైతాంగానికి సాగునీరు అందించాలని కోరుతూ శివన్నగూడెం ప్రాజెక్టును చేయడం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ మునుగోడు అంతానికి సాగు, తాగునీరు కోసం 2015లో గత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారని తెలిపారు. 11 సంవత్సరాలు గడిచిన నేటికి ప్రాజెక్టు పూర్తి కాలేదని పనులు నత్తనడక నడుస్తున్నాయని విమర్శించారు. ఎలాంటి నీటి ఆధారం లేని ఈ ప్రాంతానికి శివన్నగూడెం ప్రాజెక్ట్ ఎంతో కీలమైనది అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నుండి లిఫ్ట్ ద్వారా రాచకొండ ప్రాంతానికి నీరు తీసుకరావడం ద్వారా మాత్రమే నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లోని గ్రామాలకు నీరందుతుందని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేయకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను మరియు కాలువలను, నల్లగొండ జిల్లాలో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 29, 30 భువనగిరి అంబేద్కర్ విగ్రహం నుండి హైదరాబాదు ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర నిర్వహించి 31వ తేదీన వేలాది మందితో మహాధర్న నిర్వహిస్తున్నామని ఈ ధర్నాలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి జహంగీర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుంటోజు శ్రీనివాస చారి, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు యండి పాషా, మండల నాయకులు రాచకొండ కృష్ణ, కొమ్ము మల్లేశం తదితరులు పాల్గొన్నారు.