royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅన్ని మతాలు ఐక్యంగా ఉంటేనే దేశం సస్యశ్యామలం › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 2:26 pm
Date of Publish : 16 Aug 2026, 8:58 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 2 💬 0
Latest News

అన్ని మతాలు ఐక్యంగా ఉంటేనే దేశం సస్యశ్యామలం

అన్ని మతాలు ఐక్యంగా ఉంటేనే దేశం సస్యశ్యామలం

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 15: అన్ని మతాల ప్రజలు ఐక్యంగా, శాంతియుతంగా జీవించినప్పుడే దేశం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని సెంట్రల్ పీస్ కమిటీ సికింద్రాబాద్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శరత్ శ్యామ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సెంట్రల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో బర్కత్‌పురాలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ పీస్ కమిటీ అధ్యక్షుడు ఎస్. నారాయణ రెడ్డితో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ శ్యామ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మత సామరస్యం, శాంతి, ఐక్యత ఎంతో అవసరమని అన్నారు. ప్రజలంతా పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ హస్రీద్ ముజాఫర్, మోయిస్, శ్రీ కిషన్ శర్మ, బసంత్ కౌర్ తో పాటు వివిధ జోన్లకు చెందిన సెంట్రల్ పీస్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీలో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు.