royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనారాయణగూడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 2:26 pm
Date of Publish : 16 Aug 2026, 8:52 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 4 💬 0
Latest News

నారాయణగూడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

నారాయణగూడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

రాయల్ పోస్ట్ న్యూస్ నారాయణగూడ, ఆగస్టు 15: నారాయణగూడలోని శివసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డా. గణేష్ గౌట్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
దేశం రాజకీయంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డా. గణేష్ గౌట్ కోరారు. కార్యక్రమంలో శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఠాకూర్ వికాస్ సింగ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు వంశీధర్ తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు.