royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaబాగాయత్ పాఠశాల ఘటన: మృతి చెందిన విద్యార్థిని అలీనా కుటుంబాన్ని… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 5:34 pm
Date of Publish : 15 Aug 2026, 11:56 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 3 💬 0
Latest News

బాగాయత్ పాఠశాల ఘటన: మృతి చెందిన విద్యార్థిని అలీనా కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి…విద్యార్థిని అలీనా కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందించిన భువనగిరి ఎమ్మెల్యే..అలీనా కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ

భువనగిరి రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 15/

భువనగిరి పట్టణంలోని బాగాయత్ పాఠశాలలో ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగిపడి మృతి చెందిన విద్యార్థిని అలీనా కుటుంబాన్ని భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం పరామర్శించారు.

అలీనా నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా అలీనా కుటుంబానికి తక్షణ సహాయంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.