royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకులమతాలకు అతీతంగా.. జెండా పండుగ!భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ఘనంగా… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 7:31 pm
Date of Publish : 15 Aug 2026, 11:13 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 3 💬 0
Latest News

కులమతాలకు అతీతంగా.. జెండా పండుగ!భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుజాతీయ జెండాను ఆవిష్కరించిన కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ మాజీ చైర్మన్

కులమతాలకు అతీతంగా.. జెండా పండుగ!భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుజాతీయ జెండాను ఆవిష్కరించిన కౌన్సిలర్ బర్రె పూజిత – జహంగీర్ మాజీ చైర్మన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 15/ కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేని ఏకైక జాతీయ పండుగ స్వాతంత్ర్య దినోత్సవమని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చే మహత్తర పండుగగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి మున్సిపల్ పట్టణంలోని 23వ వార్డులో శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బర్రె పూజిత- జహంగీర్ మాజీ చైర్మన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రజలు, చిన్నారులు, స్థానికులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ మాట్లాడుతూ.. వార్డులో జెండా పండుగ వాతావరణం చూసిన అనంతరం తన పాఠశాల రోజుల జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని అన్నారు. చిన్నతనంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలను జాతీయ జెండాలతో అలంకరించి, వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, అనంతరం బహుమతులు అందుకునే రోజులను గుర్తుచేసుకున్నారు. నేటి తరం పిల్లలకు కూడా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశ స్వాతంత్ర్య విలువలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, దేశ అభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆమె కోరారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు మరింత బలమైన భారతదేశాన్ని అందించడమే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనం తీసుకోవాల్సిన సంకల్పమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, యువత, చిన్నారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్లర్లు జాలిగాం విగ్నేష్, చల్లగుర్గుల కృష్ణవేణి రఘుబాబు, బెండే స్వరూప లాల్ రాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ ప్రవీణ్, వార్డ్ మరియు అరుంధతి యూత్ అసోసియేషన్ సభ్యులు బండారు రవి వర్ధన్, బర్రె సుదర్శన్,కరకాల పోచయ్య ఐలాపురం బాబు, ఎడ్ల భరత్, భూషపాక రవి, బర్రె నరేందర్, బర్రె నవీన్ తదితరులు పాల్గొన్నారు.