రుద్రంగి ఆగస్టు13 రాయల్ పోస్ట్ న్యూస్ /
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హార్ ఘర్ తిరంగా ర్యాలీ చెప్పట్టడం జరిగిందన్నారు. ప్రజలలో దేశభక్తిని పెంచడమే లక్ష్యంగా, దేశం కోసం పోరాడిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. 2047 వరకు ప్రపంచంలో భారత దేశాన్ని విశ్వగురువుగా ఎదగడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. జెండా పట్టుకుంటే ర్యాలీ అవుతుంది.గుండెలో ఉంటే దేశ భక్తి అవుతుందన్నారు. ప్రతి ఒక్క పౌరుడు తమ ఇంటిపై జాతియ జెండాను ఎగురవేయలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,బిజెపి నాయకులు,కార్యకర్తలు, యువకులు,పాల్గొన్నారు