వలిగొండ ఆగస్టు13 రాయల్ పోస్ట్ న్యూస్ / మండలంలోని వివిధ గ్రామాలు సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని సి పి ఐ మండల కార్యదర్శి సలిగంజి వీర స్వామీ అన్నారు. గురువారం సి పి ఐ ఆధ్వర్యంలో రెండవరోజు
ప్రజా చైతన్య యాత్ర వేములకొండ వెంకటాపురం, ఆరూరు, నాగారం గొల్లపల్లి, సంగేం,గోకారం , టేకుల సోమవారం, పహిల్వాన్ పురం, రెడ్ల రేపాక,మీదగా యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేస్తుందని, రైతుబంధు , రుణమాఫీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహిళలకు వంటగ్యాస్ ప్రతి మహిళలకు 2500 రూపాయలు, తులం బంగారం సంక్షేమ పథకాలు అమలు జరపటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని అన్నారు. మూసి ప్రక్షాళన సత్వరమే చేయాలని మండల వ్యాప్తంగా బస్వాపురం రిజర్వాయర్ ద్వారా సాగు త్రాగునీరు అందించాలని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్, మండల కార్యవర్గ సభ్యులు ఎలగందుల అంజయ్య, సల్వాద్రి రవీందర్,పోలేపాక యాదయ్య, పులిపల్పుల మల్లేశం, అంబటి అంజయ్య, సుద్దాల సాయికుమార్, ఆకుల శ్రీను, వడ్డేగాని శంకరయ్య, బుంగ చక్రం తదితరులు పాల్గొన్నారు.