భీమారం ఆగస్టు 13రాయల్ పోస్ట్ న్యూస్ /
భీమారం మండలం మన్నెగూడెం గ్రామం లోని 4 అంగన్వాడీ కేంద్రాలను సీడీపీఓ జయప్రద తనిఖీ చేసారు, పిల్లలతో ప్రీస్కూల్ ఆక్టివిటీస్ చేయించి, పిల్లలకు అందించే భోజనాన్ని పరిశీలించి టీచర్స్ అందరికి పాలు సూచనలు, సమయ పాలన పాటించి ప్రీస్కూల్ కార్యక్రమాలు చేయిస్తూ ప్రతి నెలలో ఒక రోజు సర్పంచ్ సమక్షంలో తల్లుల సమావేశం ఏర్పాటు చేసి బాలామృతం, ఎగ్స్ పంపిణి చేయించి పిల్లల బరువులు పరిశీలించి ఆహార ఆరోగ్య విషయాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సూపర్వైజర్ షైని మాథ్యూ, అంగన్వాడీ టీచర్స్ వినోద, కవిత, రమ ఆయా మమత తదితరులు పాల్గొన్నారు.