royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaయాదాద్రి భువనగిరి జిల్లా MRPS అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ మాదిగ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 5:05 pm
Date of Publish : 12 Aug 2026, 8:37 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 14 💬 0
Latest News

యాదాద్రి భువనగిరి జిల్లా MRPS అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ మాదిగ ఎంపిక

యాదాద్రి భువనగిరి జిల్లా MRPS అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ మాదిగ ఎంపిక

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 12/ ఎమ్మార్పీఎస్ (MRPS) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షుడిగా బొట్ల శ్రీనివాస్ మాదిగ ఎంపికయ్యారు. గత 25 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ నాయకులు మేడి పాపన్న నాయకత్వంలో గ్రామ స్థాయి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి, ఈ నూతన బాధ్యతను అప్పగించారు. శ్రీనివాస్ మాదిగ గతంలో ఉమ్మడి యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి సంఘ బలోపేతానికి విశేష కృషి చేశారు.

తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగకి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూరెల్ల రమేష్ మాదిగకి ఈ సందర్భంగా శ్రీనివాస్ మాదిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బొట్ల శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ... జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ను మరింత బలోపేతం చేస్తానని, గ్రామ గ్రామాన నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.