royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలి…రైతుల ఆందోళన… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 2:29 pm
Date of Publish : 12 Aug 2026, 7:01 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 6 💬 0
Latest News

అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలి…రైతుల ఆందోళన రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా క్రషర్‌కు అనుమతి

అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్ నిర్మాణ పనులను వెంటనే ఆపాలి…రైతుల ఆందోళన రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా క్రషర్‌కు అనుమతి

వలిగొండ ఆగస్టు12 రాయల్ పోస్ట్ న్యూస్ /
మండల పరిధిలోని పహిల్వాన్‌పూర్ గ్రామంలో పంట పొలాల మధ్య క్రషర్ మిషన్ ఏర్పాటుకు గ్రామపంచాయతీ పాలకవర్గం అనుమతి ఇవ్వడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా క్రషర్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
గ్రామంలో ఇప్పటికే మూడుసార్లు సభలు నిర్వహించి క్రషర్ మిషన్ వద్దని గ్రామ ప్రజలు, రైతులు స్పష్టంగా అభ్యంతరం తెలిపినప్పటికీ,తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా గ్రామపంచాయతీ పాలకవర్గం అనుమతి ఇవ్వడం ఏమిటని రైతులు నిలదీశారు.
క్రషర్ మిషన్ కారణంగా వెలువడే దుమ్ము, ధూళితో పంటలు దెబ్బతినడంతో పాటు వ్యవసాయ భూములు నాశనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని, పంట పొలాలే తమ జీవనాధారమని తెలిపారు.మా పంట పొలాలను నాశనం చేసే క్రషర్ మిషన్ మాకు వద్దు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా అనుమతి ఇవ్వడం సరికాదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి క్రషర్ అనుమతులను పరిశీలించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని వారు కోరారు.
ఈకార్యక్రమంలో ఎలిమినేటి జంగారెడ్డి,శ్రీశైలం రెడ్డి, సత్తిరెడ్డి సునీత, మల్లారెడ్డి కలమ్మ,వెంకట్ రెడ్డి విమల,మోహన్ రెడ్డి పద్మ,శ్రీనివాస్ రెడ్డి, అంజమ్మ,బుచ్చిరెడ్డి లక్ష్మి, దుబ్బ రమేష్,బాల నర్సమ్మ,పల్లపు అంజమ్మ,శీను కనకమ్మ, సత్తిరెడ్డి వెంకట్రెడ్డి, జంగారెడ్డి,మిటకానికి కిరణ్ రెడ్డి,దుర్గమ్మ, సరిత,శారద,రైతులు తదితరులు పాల్గొన్నారు.