royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనీట్-2026లో ప్రతిభ: సెయింట్ ఆన్స్ పూర్వ విద్యార్థిని సాత్వికారెడ్డికి ఘన… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 3:21 pm
Date of Publish : 12 Aug 2026, 6:15 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 7 💬 0
Latest News

నీట్-2026లో ప్రతిభ: సెయింట్ ఆన్స్ పూర్వ విద్యార్థిని సాత్వికారెడ్డికి ఘన సన్మానం..

నీట్-2026లో ప్రతిభ: సెయింట్ ఆన్స్ పూర్వ విద్యార్థిని సాత్వికారెడ్డికి ఘన సన్మానం..

రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 12/ మోత్కూర్:
స్థానిక సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల పూర్వ విద్యార్థిని కుకునూరు సాత్వికారెడ్డి నీట్-2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయిలో 645వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆమెను, ఆమె తల్లిదండ్రులైన కుకునూరు జ్యోతి - విష్ణువర్ధన్ రెడ్డి గార్లను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.

నర్సరీ నుంచి పదో తరగతి వరకు సెయింట్ ఆన్స్ పాఠశాలలోనే చదివిన సాత్వికారెడ్డి, జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ & చైర్ పర్సన్ పసల విజయా మరియన్న హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సాత్వికారెడ్డిని, ఆమె తల్లిదండ్రులను పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదివి, నేడు వైద్య విద్యకు అర్హత సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తెచ్చిన సాత్వికారెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సాత్వికారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.