royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమేడిపల్లి, పీర్జాదిగూడడివిజన్ లలో ఘనంగా బోనాల వేడుకలు…ముఖ్య అతిధి గా… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 2:26 pm
Date of Publish : 10 Aug 2026, 6:08 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

మేడిపల్లి, పీర్జాదిగూడడివిజన్ లలో ఘనంగా బోనాల వేడుకలు…ముఖ్య అతిధి గా హాజరైన డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్…

మేడిపల్లి, పీర్జాదిగూడడివిజన్ లలో ఘనంగా బోనాల వేడుకలు…ముఖ్య అతిధి గా హాజరైన డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్…

రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ ఆగస్ట్మ 9/ల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్, అనిల్ రెడ్డి, అంజిరెడ్డి, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, హాజరై పీర్జాదిగూడ మరియు మేడిపల్లి డివిజన్ లోని అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ జలెందర్ రెడ్డి,మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ డివిజన్ అధ్యక్షులు బండి శ్రీరాములు, పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్, దర్గా దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తుంగతుర్తి రవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా ఐకమత్యంతో సుఖశాంతులతో జీవించాలని, మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారని అన్నారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, sc సెల్, st సెల్, మైనారిటీ సెల్,ఓబీసీ సెల్ నాయకులు మరియు పలు కాలనీల అధ్యక్షులు, ఆలయ కమిటీ ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.