రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్కేసర్ ఆగస్ట్తె 9/లంగాణ రాష్ట్ర ప్రత్యేక పండుగైన బోనాల పండుగ మహోత్సవాలు మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి,ఫిర్జాదిగూడ డివిజన్లలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు స్థానిక నాయకులతో కలిసి పలు కాలనీల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రత్యేక పండుగ బోనాల పండుగ అని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అమ్మవారి కృపాకటాక్షాలతో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో జైపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బండారు పవన్ రెడ్డి, స్వరూప్ చంద్ర, చంద్రశేఖర్ గుప్తా, సంతోష్ రెడ్డి, రమేష్ నాయుడు, కొమ్మరాజు సతీష్, జస్వంత్ గౌడ్, బుల్లెట్ సాయి,వివిధ సంఘాల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.