రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 09: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఆర్ కరాటే అకాడమి ఆధ్వర్యంలో నారాయణగూడ లోని డాక్టర్ జిఎస్ మెల్కోటే పార్కులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కానిస్టేబుల్ వి.సుధాకర్ కరాటేలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు. నిర్ణీత సమయం 8 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన ప్రదర్శనను కేవలం 3 నిమిషాల 26 సెక్లలో 80 షాబాద్ టైల్స్ ను 9 కరాటే టెక్నిక్స్ తో బ్రేక్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. సుధాకర్ కు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ రికార్డ్స్ సర్టిఫికెట్స్ మెడల్స్ ను అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జి. మహాలక్ష్మీ రామన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత రామన్ గౌడ్, జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణా రెడ్డి, నర్సింగ్ రావు, కరీమ్, అమృతరెడ్డి, గణ సంతోషిణి రెడ్డి, రాజు, అవిఘ్న వెంకటరెడ్డి, మెల్కోటే పార్కు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూషన్ రావు, భరత్వాజ్, అభిషేక్ రెడ్డి, జైస్వాల్, జెక్కి హసన్, అర్యన్ కిషన్, రఘు, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.