royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవైఎంసీఏ క్రీడా విజేతలకు బహుమతుల ప్రదానం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 2:29 pm
Date of Publish : 10 Aug 2026, 4:58 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 9 💬 0
Latest News

వైఎంసీఏ క్రీడా విజేతలకు బహుమతుల ప్రదానం…

వైఎంసీఏ క్రీడా విజేతలకు బహుమతుల ప్రదానం…

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 09: వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 26వ వార్షిక 'కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ -2026' క్రీడా విజేతలకు సిఎస్ఐ వెస్లీ చర్చి ప్రెస్పిటర్ ఇన్చార్జీ రెవ. డాక్టర్ టి. భాస్కర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఖోఖో, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డి, తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థుళు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యార్థులు చదువుపై ఎంత శ్రద్ద వహిస్తారో అదే స్థాయిలో క్రీడలపైనా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ పి.జోనథన్ ధర్మరాజు, ఉపాధ్యక్షుడు జిఎం దీన్ దయాల్, బోర్డు సలహాదారు బిజె వినయస్వరూప్, కో ఆర్డినేటర్ బి. ఇమ్మాన్యుయేల్, ప్రధానకార్యదర్శి ప్రిస్ట్ గైస్, భవాని, తదితరులు పాల్గొని విజేతలైన క్రీడాకారులను అభినందించారు.