హైదరాబాద్ ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ / దేశంలో డ్రగ్స్ రహిత యువ భారత నిర్మాణమే అగర్వాల్ సమాజ్ తెలంగాణ, సామజిక ఉద్యమం "శాపథ్" లక్యం అని అగర్వాల్ సమాజ్ తెలంగాణ "శాపథ్" చైర్మన్ రామ్ నివాస్ బన్సల్ తెలిపారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో "శాపథ్" ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర శాస్త్రి, డైరెక్టర్లు కన్నయ్య గడియ, శిశిర్ కేడియా, న్యాయ సలహాదారు విశాల్ కేడియా లతో కలసి రామ్ నివాస్ బన్సల్ మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే హాని గురించి అవగాహన, మాదకద్రవ్యాలకు వద్దు చెప్పండి" అనే సందేశాన్ని ప్రచారం చేయడానికి బలమైన మరియు సురక్షితమైన సమాజాన్ని నిర్మించండనికి "శాపథ్" పేరుతో అగర్వాల్ సమాజ్ తెలంగాణ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలలొ రాష్ట్ర ప్రభుత్వ విద్య శాఖ, పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ అంటి - డ్రగ్స్ టీం ల సహకారం తో మహత్తరమైన సామజిక ఉద్యమం ప్రారంభించిందని అన్నారు. ఇందులో భాగంగానే ఆగష్టు 11న మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం. ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత జీవితం కోసం సందేశాలను పంచుకోవడానికి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అని తెలిపారు. దేవేంద్ర శాస్త్రి మాట్లాడుతూ మాదకద్రవ్య రహిత యువ భారతం కోసం "శాపథ్" ఆధ్వర్యంలో, అగర్వాల్ శిక్ష సమితి, లయన్స్ క్లబ్, సమర్పణ్ సహకారంతో 2026 ఆగష్టు 11న ఉదయం 8 గంటలకు మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన ర్యాలీ వేలాదిమంది విద్యార్థిని విద్యార్థులతో హైదరాబాద్, చారిత్రాత్మక చార్మినార్ నుండి పత్తర్ గట్టి అగర్వాల్ బాలికల పాఠశాల మైదానం వరకు జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్య జండా ఊపి ప్రారంభిస్తారని, అనంతరం మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన సదస్సు, ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సుకు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సజ్జనార్, పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ వైద్యులు పాల్గొంటారని పేర్కొన్నారు.