కాచిగూడ, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ / బర్కత్ పుర లోని తెలంగాణ యవతి మండలి శ్రీమతి ఎ.శ్యామలదేవి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆదరగొట్టాయి. సంగీత హోరుకు లయబద్ధంగా సాగిన నృత్యవిన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షో హోయలు మైమరిపించాయి. 'మిస్ ప్రెషర్స్', 'మిస్ ఫ్రెష్ పేస్' తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఐవిఎస్ హేమమాలిని, అధ్యాపకులు, విద్యార్ధినీలు పాల్గొన్నారు.