యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 8 రాయల్ పోస్ట్ న్యూస్ /
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో జిల్లా ప్రముఖ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని పలువురు ఆశీర్వదించారు.
అతి చిన్న వయసులోనే జిల్లాలో మంచి పేరు సంపాదించుకొని సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఏ ఆపద వచ్చినా వారికి సహాయం చేస్తూ అండగా నిలబడుతున్నారని పలువురు అన్నారు.పలుచోట్ల అన్నదానాలు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా.ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు జనగాం పాండు,ప్రధాన కార్యదర్శి నీలం ఓం ప్రకాష్ గౌడ, భువనగిరి మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జక్కా రాఘవేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, మాజీ ఎంపీపీ కేశవ పట్నం రమేష్, మాజీ సింగల్ విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్ పి టీ సి సందేలా సుధాకర్, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పండు, టౌన్ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏ ఆంజనేయులు, సర్పంచులు ఉప సర్పంచ్ లు వార్డు మెంబర్లు ఆర్ఎస్కే టీమ్ మెంబర్లు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.*