రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 8/ ఈనెల 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా జరుగు జైలు భరో లో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఆల్ అమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి పాండు అన్నారు
సిఐటియు ఆధ్వర్యంలో జైలు భరో సందర్భంగా నిరసనగా జరుగు రాస్తారోకో ఆల్ హమాలి వర్కర్స్ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ భువనగిరి టౌన్ పరిధిలో ఉన్న రైస్ మిల్లు ఇండస్ట్రీల వద్దకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా
దాసరి పాండు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు దేశ ప్రజలను బానిసలుగా చేసి దేశ సంపదను కొల్లగొట్టుకుపోయారని స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించుకోవడం జరిగిందని కానీ నేటి బిజెపి ప్రభుత్వం బ్రిటిష్ వారిని తలపించే విధంగా దేశంలో ఉన్న ఖనిజ సంపద ప్రభుత్వ ప్రభుత్వ సంపదను బ్రిటిష్ వారి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దోచుకుంటే నేడు బిజెపి పాలనలో గుజరాత్ అంబానీ ఆదాని కార్పొరేట్ కంపెనీలు దోచిపెడుతున్నదని పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రజా హక్కులను ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తూ ప్రజలను ప్రజాతంత్ర వాదులను హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపడం జరుగుతుందని ఇలాంటి నియంత ధోరణికి వ్యతిరేకంగా క్యూట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో క్యూట్ ఇండియా ఉద్యమం లాగా పోరాటాలు జరిపి కార్మికుల హక్కులను ప్రజా హక్కులను కాపాడుకోవడం కోసం జరుగుతున్న జైలు భరో కార్యక్రమంలో ప్రజలు కార్మిక వర్గం పాల్గొని మోడీ విధానాలను వ్యతిరేకించాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ నాయకులు నరసింహ ఐలయ్య ఆసిఫ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు