royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవంగపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలి: వంగపల్లి గ్రామ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 4:23 pm
Date of Publish : 08 Aug 2026, 7:25 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 12 💬 0
Latest News

వంగపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలి: వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణా ప్రతాప్,…. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి..సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలోనే సమస్య పరిష్కారానికి హామీ..

వంగపల్లిలో ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలి:       వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణా ప్రతాప్,….  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి..సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలోనే సమస్య పరిష్కారానికి హామీ..

రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి ఆగస్ట్ 8/

వంగపల్లి గ్రామంలోకి ఎక్స్‌ప్రెస్ బస్సులను పునరుద్ధరించడంతో పాటు నూతన ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శనివారం రగ్గు రవళి రాణాప్రతాప్ వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఎదురవుతున్న రవాణా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వినతిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడారు. వంగపల్లి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని, ఎక్స్‌ప్రెస్ బస్ స్టాప్ ఏర్పాటుకు సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవళి రాణా ప్రతాప్, వార్డు సభ్యులు కళ్ళే వినోద్ కుమార్, గడ్డం విజయలక్ష్మి ప్రకాష్‌లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.