royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaగ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు : సర్పంచ్ రవళి… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 4:55 pm
Date of Publish : 08 Aug 2026, 8:15 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు : సర్పంచ్ రవళి రాణా ప్రతాప్….

గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు : సర్పంచ్ రవళి రాణా ప్రతాప్….

యాదగిరిగుట్ట, ఆగస్టు 07 రాయల్ పోస్ట్ న్యూస్ /

ఏ ఆధారాలు లేకుండా మాపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని వంగపల్లి గ్రామ సర్పంచ్ ఒగ్గు రవళి రాణాప్రతాప్ హెచ్చరించారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండల పరిధిలోని వంగపల్లి గ్రామంలో విలేఖరులతో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 122లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతుంటే గొంగిడి రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తి వాటిని తొలగించారని తెలిపారు. వంగపల్లి గ్రామాభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా గొంగిడి రాజశేఖర్రెడ్డిని రూ.30 లక్షలు మేము డిమాండ్ చేసినట్టు ప్రచారం చేస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని, మేము దేనికైనా సిద్ధమేనన్నారు. ఈ విషయంపై ఇప్పటికే యాదగిరిగుట్ట సీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.