royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaనిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి…జనగాం యాదాద్రి జిల్లాల… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:48 pm
Date of Publish : 08 Aug 2026, 6:11 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి…జనగాం యాదాద్రి జిల్లాల కోఆర్డినేటర్ ఆలేటి కల్పలత…

రాయల్ పోస్ట్ న్యూస్ జనగాం ఆగస్ట్ 7/ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు ప్రదం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కానుక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అందిస్తామని జనగాం యాదాద్రి జిల్లాల కోఆర్డినేటర్ అలేటి కల్పలత తెలిపారు. జిల్లాలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతకు హోటల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రిసిటీసోలార్, ఆటోమోటివ్, ఫోర్-వీలర్, టూ-వీలర్ కోర్సులలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. 8వ తరగతి, 10వ తరగతి, ఆ పైన ఇంటర్-డిగ్రీ, ఐటీఐ డిప్లొమా వరకు చదివిన వారు అర్హులని అన్ని కులాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని శిక్షణ కాలంలో వారికి ఉచిత హాస్టల్, భోజనం, వసతి, స్టడీ మెటీరియల్, యూనిఫాం కల్పించబడినని ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు, జిరాక్స్‌లతో హైదరాబాద్‌లోని లింగారెడ్డి గూడెం షాద్ నగర్ లోఉన్న ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కోఆర్డినేటర్ ఆలేటి కల్పలత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివరాల కోసం 7013692979 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.