royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅఖిల గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర ఎన్నికలకు ముహూర్తం…ఆగస్టు 23న… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:48 pm
Date of Publish : 08 Aug 2026, 6:00 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 16 💬 0
Latest News

అఖిల గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర ఎన్నికలకు ముహూర్తం…ఆగస్టు 23న హైదరాబాద్‌లో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు…39 పదవులకు ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల…

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 07:

అఖిల గాండ్ల తెలికుల సంఘం తెలంగాణ (రిజి. నెం. 985/2014) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వెన్నంపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. రాష్ట్ర సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు మొత్తం 39 ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. సంఘం రాజ్యాంగం, ఎన్నికల నిబంధనల ప్రకారం షెడ్యూల్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9, 2026 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 11 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అనంతరం ఆగస్టు 12న నామినేషన్ల పరిశీలన నిర్వహించనుండగా, ఆగస్టు 18 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. తుది అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం ఆగస్టు 23, 2026న హైదరాబాద్‌లో పోలింగ్ నిర్వహించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల్లో పాల్గొని, అర్హులైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో సభ్యులందరూ సహకరించి, ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు, నామినేషన్ ప్రక్రియ, అర్హతలు, నియమావళి తదితర సమాచారం కోసం ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వెన్నంపల్లి శ్రీనివాస్ను 99496 39015 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఎన్నికల షెడ్యూల్

  • నామినేషన్ల ప్రారంభం: 09-08-2026
  • నామినేషన్ల ముగింపు: 11-08-2026
  • నామినేషన్ల పరిశీలన: 12-08-2026
  • నామినేషన్ల ఉపసంహరణ: 18-08-2026
  • పోలింగ్: 23-08-2026 (హైదరాబాద్)

"ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం. సభ్యులందరూ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని సంఘ అభివృద్ధికి తోడ్పడాలి." అని ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ వెన్నంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.