royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకరాటే సాధనతో ఆత్మవిశ్వాసం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:48 pm
Date of Publish : 08 Aug 2026, 5:57 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 16 💬 0
Latest News

కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం…

కరాటే సాధనతో ఆత్మవిశ్వాసం…

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 07: కరాటే సాధన వల్ల క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సమురాయ్ ప్రొఫెషనల్ కరాటే అసోసియేషన్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ కియోషి సిద్దార్ద్ షా అన్నారు. శుక్రవారం నారాయణగూడలోని సమురాయ్ ప్రొఫెషనల్ కరాటే అకాడమిలో నిర్వహించిన బెల్ట్ గ్రేడ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన 35 మంది విద్యార్థులకు కరాటే కలర్ బెల్ట్స్ తో పాటు సర్టిఫికెట్స్ ను ఆయన ప్రదానం చేశారు. కిక్కర్స్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ బి. నాగరాజు, మాస్టర్ సురేందర్, షోటోకాన్ కరాటే గ్రాండ్ మాస్టర్ సుబ్బు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పరిశీలకులుగా వ్యవహరించారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్క విద్యార్థి కరాటే నేర్చుకోవాలని అన్నారు.