royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaగెలుపోటములను సమానంగా స్వీకరించాలి…అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి)… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 5:55 pm
Date of Publish : 06 Aug 2026, 10:25 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 14 💬 0
Latest News

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి…అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి) జె.అన్యోన్య

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి…అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి) జె.అన్యోన్య

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 06: క్రీడల్లో జయాపజయాలను సమానంగా స్వీకరించాలని అసిస్టెంట్
ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి) జె. అన్యోన్య అన్నారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న వైఎంసీఏ కార్గిల్ విక్టరీ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను గురువారం నారాయణగూడ లోని వైఎంసీఏ క్రీడా మైదానంలో ఆయన ప్రారంభించారు. భవిష్యత్ మీదే.. చాంపియన్లు మీరేనని.. ఒక లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగి జీవితంలో చాంపియన్లుగా నిలవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ జోనతన్ ధర్మరాజు, ఉపాధ్యక్షులు జిఎం దీన్దియాల్, సిఐడి ఇన్స్ పెక్టర్ విజయ్ కుమార్, వైఎంసీఏ బోర్డు కన్సల్టెంట్ బి.జె. వినయస్వరూప్, వైఎంసీఏ ప్రధానకార్యదర్శి ప్రిస్ట్ లీ గైస్, తదితరులు పాల్గొన్నారు.