royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaభువనగిరి పురపాలక సంఘంలో ఆచార్య జయశంకర్ జయంతి/వర్ధంతి వేడుకలు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 12:24 pm
Date of Publish : 06 Aug 2026, 3:00 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 7 💬 0
Latest News

భువనగిరి పురపాలక సంఘంలో ఆచార్య జయశంకర్ జయంతి/వర్ధంతి వేడుకలు…

భువనగిరి పురపాలక సంఘంలో ఆచార్య జయశంకర్ జయంతి/వర్ధంతి వేడుకలు…

​జయశంకర్ సేవలు అమూల్యం: మునిసిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్…

​తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి అర్పించిన భువనగిరి మునిసిపల్ పాలకవర్గం…

రాయల్ పోస్ట్ న్యూస్
​భువనగిరి, ఆగస్టు 06:
స్థానిక భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భావజాల వ్యాప్తికర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
​ఈ సందర్భంగా మునిసిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలు, అందించిన మార్గనిర్దేశం అమూల్యమైనవని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి, వార్డు సభ్యులు నాయిని అరుణ పూర్ణచందర్, బర్రె పూజిత జహంగీర్, నాకోటి నగేష్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ గారికి నివాళులర్పించారు.