royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaరాయగిరి ఈద్గా స్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతివ్వాలి…– తెలంగాణ రాష్ట్ర… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 2:36 pm
Date of Publish : 06 Aug 2026, 2:39 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 13 💬 0
Latest News

రాయగిరి ఈద్గా స్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతివ్వాలి…– తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు మాజీ కమిటీ మెంబర్ మహ్మద్ షరీఫ్ వినతి

రాయగిరి ఈద్గా స్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతివ్వాలి…– తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు మాజీ కమిటీ మెంబర్ మహ్మద్ షరీఫ్ వినతి

​అసాంఘిక కార్యకలాపాలు నివారించేందుకు మసీదు నిర్మాణం చేపట్టాలి: మహ్మద్ షరీఫ్రా

రాయల్ పోస్ట్ న్యూస్ ​భువనగిరి ఆగస్ట్ 6/ :
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని ఈద్గా స్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ మాజీ సభ్యుడు మహ్మద్ షరీఫ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్‌లోని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గారికి వినతిపత్రం రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాయగిరి గ్రామంలోని సర్వే నెంబర్ 787(ఎస్)/(70) పరిధిలో ఉన్న 150 చదరపు గజాల ఈద్గా స్థలం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నివారించడంతో పాటు స్థానిక ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా సదరు స్థలంలో మసీదు నిర్మించాలని స్థానికులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక ముస్లిం ల సౌకర్యార్థం మరియు ప్రధాన రహదారి గుండా వెళ్లే వారికీఅలాగే జిల్లా సమీకృత సముదయానికి వచ్ఛే వారు కూడా సదరు స్థలంలో ప్రార్ధన చేయుటకు సౌకర్యర్థం మసీదు నిర్మాణానికి సంబంధిత అధికారులు తక్షణమే అనుమతులు మంజూరు చేసి, తగు చర్యలు తీసుకోవాలని ఆయన వినతి పత్రం ద్వారా సీఈఓను కోరారు.