royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaతల్లిపాలు బిడ్డకు శ్రీ రామ రక్షా” సర్పంచ్ దేవేందర్ నాయక్..గంగారం… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 8:31 pm
Date of Publish : 05 Aug 2026, 6:29 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 10 💬 0
Latest News

తల్లిపాలు బిడ్డకు శ్రీ రామ రక్షా” సర్పంచ్ దేవేందర్ నాయక్..గంగారం గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు….

తల్లిపాలు బిడ్డకు శ్రీ రామ రక్షా” సర్పంచ్ దేవేందర్ నాయక్..గంగారం గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు….

"( రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్టు,05:)

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం గంగారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ… ఏటా ఆగస్టు 1 నుండి 7వ తారీకు వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలలో భాగంగా మహేశ్వరం మండలం గంగారం గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం థీమ్ "తల్లిపాలతో ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు"గా నిర్ణయించారు. కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశువుకు రోగనిరోధక శక్తి, ఆరోగ్యకరమైన ఎదుగుదల దీర్ఘకాలిక ఆరోగ్యంపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలోని ముఖ్యాంశాలు అమ్మ పాలు - అమృతం పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల నవజాత శిశు మరణాలను 22 శాతం వరకు తగ్గించవచ్చని, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు, ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు పౌష్టికాహారం ఇవ్వాలని నిపుణులు సూచించారు. కుటుంబ భాగస్వామ్యం తల్లిపాలు ఇవ్వడంలో తల్లితో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త అత్తమామల సహకారం ఎంత అవసరమో వివరించారు. సామాజిక మద్దతు ఉంటేనే తల్లిపాల రేటు పెరుగుతుందని తెలిపారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు పనిచేసే తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్లు, క్రెచ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంగన్వాడీ మండల్ సూపర్వైజర్ విద్యావతి మాట్లాడుతూ "తల్లిపాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, అది శిశువుకు మొదటి టీకా. ఇన్ఫెక్షన్లు, డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే తల్లికి రొమ్ము క్యాన్సర్, మధుమేహం వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుంది" అని అన్నారు. గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి గర్భిణి బాలింతకు తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు పంచాయతీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. "ఆరోగ్యకరమైన సమాజానికి ఆరోగ్యకరమైన పిల్లలు అవసరం. అందుకు తల్లిపాలే పునాది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, వార్డ్ మెంబర్స్ ఎం. మోహన్, ఎం. రవి, ఎం. శ్రీనివాస్, ఎం. భాస్కర్, అంగన్వాడీ మండల్ సూపర్వైజర్ విద్యావతి, అంగన్వాడీ టీచర్ అనిత, స్కూల్ టీచర్ సురేష్, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ అనిత అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఈ వారం రోజుల పాటు ఇంటింటికి అవగాహన ర్యాలీలు, పోస్టర్ల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు.