royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఅక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి…రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 1:41 pm
Date of Publish : 03 Aug 2026, 7:34 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 19 💬 0
Latest News

అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి…రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం ఇవ్వాలి…రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు…రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

హైదరాబాద్, ఆగస్టు 03 రాయల్ పోస్ట్ న్యూస్ /
రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ (డీఎంఏసీ)ల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు విషయంలో జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని అర్హులున్న టీడబ్ల్యూజేఎఫ్ కు అక్రెడిటేషన్ కమిటీల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు ప్రాతినిధ్యం ఇవ్వకుండా వ్యవహరించడాన్ని సవాల్ చేస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన రిట్ పిటిషన్‌పై గత ఆరు నెలలుగా పలుమార్లు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు, పిటిషనర్ తరఫున న్యాయవాదులు తమ వాదనలు కోర్టు ముందు వినిపించారు.ఇరుపక్షాల వాదనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటు విధానం, జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యానికి సంబంధించిన నిబంధనలను పరిశీలించిన అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహినుద్దీన్‌ల ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ తీర్పుతో రాష్ట్రంలోని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్‌కు అధికారిక ప్రాతినిధ్యం లభించే మార్గం సుగమమైంది. జర్నలిస్టు సంఘాల మధ్య సమాన అవకాశాలు, పారదర్శకత, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యానికి ఈ తీర్పు దోహదపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైకోర్టు తీర్పును తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించింది. జర్నలిస్టుల హక్కులు, గౌరవం, సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న తమ పోరాటానికి ఇది న్యాయపరమైన విజయమని పేర్కొంది. ఈ తీర్పును వెంటనే అమలు చేసి, అన్ని జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘం నాయకులు కోరారు.
ఈ తీర్పు భవిష్యత్తులో మీడియా అక్రెడిటేషన్ కమిటీల ఏర్పాటులో అన్ని గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా మార్గదర్శకంగా నిలుస్తుందని జర్నలిస్టు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయం, ధర్మం తమవైపు ఉందని, హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ సంఘం సభ్యుల విజయం అని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పేర్కొన్నారు.