royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaపినపాక నియోజకవర్గంలో పెరిగిన సీజనల్ వ్యాధులు – ఉచిత హెల్త్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 20 Aug 2026, 4:48 pm
Date of Publish : 03 Aug 2026, 6:13 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 11 💬 0
Latest News

పినపాక నియోజకవర్గంలో పెరిగిన సీజనల్ వ్యాధులు – ఉచిత హెల్త్ క్యాంపులు, ఫాగింగ్ నిర్వహించాలిజిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన కర్నె రవి

పినపాక నియోజకవర్గంలో పెరిగిన సీజనల్ వ్యాధులు – ఉచిత హెల్త్ క్యాంపులు, ఫాగింగ్ నిర్వహించాలిజిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన కర్నె రవి

పినపాక నియోజకవర్గంలో పెరిగిన సీజనల్ వ్యాధులు – ఉచిత హెల్త్ క్యాంపులు, ఫాగింగ్ నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేసిన కర్నె రవి

మణుగూరు, ఆగస్టు 03 ( రాయల్ పోస్ట్ న్యూస్ ):పినపాక నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు తీవ్రంగా వ్యాపిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని మణుగూరు బాలాజీ నగర్ నివాసి కర్నె రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి సోమవారం ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా కర్నె రవి మాట్లాడుతూ… పినపాక నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాలు మరియు కాలనీలలో మురుగునీరు నిలిచిపోయి దోమల ఉధృతి విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటికీ ఒకరు చొప్పున జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. పరిస్థితి మరింత విషమించక ముందే సంబంధిత పంచాయతీ మరియు వైద్యారోగ్య శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు:
పారిశుధ్య పనులు: గ్రామాలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి నిల్వలను తొలగించి వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి.దోమల నివారణ: దోమల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని గ్రామాలలో తక్షణమే ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల మందు పిచికారీ చేయాలి.ప్రత్యేక హెల్త్ క్యాంపులు: ప్రతి గ్రామంలో వైద్య బృందాలతో ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, బాధిత ప్రజలకు రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులు పంపిణీ చేయాలి.అవగాహన సదస్సులు: సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత మండలాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి పినపాక నియోజకవర్గ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.