royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఆగష్టు 22,23,24తేదీలలో GMPS రాష్ట్ర 4వ మహాసభలు-GMPS జిల్లా అధ్యక్షుడు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 4:13 pm
Date of Publish : 03 Aug 2026, 5:38 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 15 💬 0
Latest News

ఆగష్టు 22,23,24తేదీలలో GMPS రాష్ట్ర 4వ మహాసభలు-GMPS జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు పిలుపు…

ఆగష్టు 22,23,24తేదీలలో GMPS రాష్ట్ర 4వ మహాసభలు-GMPS జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు పిలుపు…

రాయల్ పోస్ట్ న్యూస్ చౌటుప్పల్ న్యూస్ ఆగష్టు 3:మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లలో ఆగష్టు 22,23,24 తేదీలలో జరగనున్న గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం (GMPS) రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా GMPS అధ్యక్షుడు మద్దెపురం రాజు పిలుపునిచ్చారు.సోమవారం చౌటుప్పల్ పట్టణంలో GMPS రెవిన్యూ డివిజన్ స్థాయి ప్రాంతీయ సమావేశం కొండె శ్రీశైలం అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు మాట్లాడుతూ గొర్రెలు,మేకల పెంపకందారులు తరతరాలుగా వృత్తి చేసుకుంటూ సమాజానికి పోషకాహారం అందిస్తున్నా,సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు.గత 30 సంవత్సరాలుగా GMPS గొర్రెల కాపరులను చైతన్యపరుస్తూ వారి హక్కుల కోసం పోరాడి అనేక ఫలితాలు సాధించిందని తెలిపారు.యాదాద్రి జిల్లాలో గొర్రెల కాపరులను ఐక్యం చేసి,రోడ్లపై జీవాలతో రాస్తారోకో చేసి,భూస్వాములు,పెత్తందారులను ఎదిరించి గొర్రెలు,మేకలకు ఉచితంగా మేత మేపుకునేలా 1016,559,64 జీవోలను తీసుకురావడంలో GMPS కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఉమ్మడి రాష్ట్రంలోనూ నేటి తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక ఉద్యమాలు నడుపుతుంది.జీవాలకు మందులు,పశువుల డాక్టర్లను,మేత భూములను,తుమ్మ చెట్లపై హక్కులను,ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియో,సబ్సిడీ రుణాలు సాధించాము.భవిష్యత్తులో అనేక ఉద్యమాలు చేసి సాధించాల్సిన అవసరం ఉంది.దానికోసం గొర్రెల కాపర్లు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో నగదు బదిలీతో గొర్రెల పంపిణీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నా అమలు చేయడం లేదు.ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోతే జిఎంపిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలోనే జి.ఎం.పిఎస్ రాష్ట్ర 4వ మహాసభలు ఆగష్టు 22,23,24తేదీలలో చెంగిచెర్లలో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ మహాసభలో గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలు రూపొందిస్తామని తెలిపారు.ఈ మహాసభలకు గొల్ల,కురుమలు,విద్యావంతులు,మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో GMPS జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహ్మ,సహాయ కార్యదర్శి కొండె శ్రీశైలం,ఉపాధ్యక్షులు నారి వెంకటేష్,జిల్లా కమిటీ సభ్యులు భీమనబోయిన బాలరాజు,జెనిగల యాదయ్య,గాజుల అంజయ్య,నారి మల్లేశం,బుగ్గ లక్ష్మయ్య,గడగోటి జంగయ్య,అరిగె బీరప్ప, బెడిద రమేష్,మల్లేష్ పాల్గొన్నారు.