royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaప్రజా కళల్ని ప్రోత్సహించాలి-ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 7:31 pm
Date of Publish : 03 Aug 2026, 4:45 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 32 💬 0
Latest News

ప్రజా కళల్ని ప్రోత్సహించాలి-ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ

ప్రజా కళల్ని ప్రోత్సహించాలి-ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ

అభ్యుదయ ఆలోచనలతో ప్రజలను చైతన్యవంతం చేయాలి- ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రాచకొండ జనార్దన్

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి యాదాద్రి భువనగిరి ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకిని జానకి సంస్కరణ సభ స్థానిక సుందరయ్య భవన్ లో నిర్వహించడాం జరిగింది.ఈ సంస్కరణ సభకు ముఖ్య అతిధిగా ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రముఖ గాయని జానకి గారు వందలాది పాటలతో దేశాన్ని గర్వించదగినటువంటి గానంతో తన జీవితాన్ని ప్రస్తావించి అభ్యుదయ ఆలోచనలతో అనేక అవార్డులు వచ్చినా కూడా వాటికి తిరస్కరించి ప్రజల కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి గాన కోకిల జానకి అని అన్నారు అదేవిధంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ అరుణోదయ నాగన్న అభ్యుదయ ఆలోచనతో తన పాటలతో ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలకపాత్ర వహించి వయసు మీద పడుతున్న కూడా ప్రజల కోసమే చిరస్థాయిగా నిలవాలని ఒక అభ్యుదయ శాస్త్రంగా వలచుకొని ఎక్కడో చీకాకోనగరాన పుట్టినటువంటి ఎర్రజెండ అని గ్రామస్థాయి దాకా పాట రూపంలో తీసుకువచ్చినటువంటి గొప్ప సామాజిక సాంస్కృతిక అభ్యుదయ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి అరుణోదయ నాగన్న అని అన్నారు స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించినటువంటి ఐక్య సాంస్కృతిక కళాకారుల చైతన్యంతో మనమందరం ఏకతాటి పైకి రావడం ఎంతో గర్వకారణమని భవిష్యత్తులో మనందరం ఒకే వేదిక మీద ఉండి మతోన్మాద భావాజాలన్నీ పాట రూపంలో విస్మరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు రాష్ట్ర కమిటీ సభ్యులు దేశపాక రవి, గంటేపాక శ్రీకృష్ణ పిఎన్ఎం జిల్లా ఉపాధ్యక్షులు గుండు నరసింహ
తెలంగాణ సాహితి జిల్లా కార్యదర్శి జిట్ట భాస్కర్ రెడ్డి రచయిత కళ్యాణి, అరుణోదయ జిల్లా బాధ్యులు ఆర్ ఉదయ్, భాస్కర్ నాయక్ తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేశం
పిఎన్ఎం నాయకులు బర్రె మధు మద్దూరు సాయి శివగళ్ల సంపత్ గుర్రం నరసింహులు తదితరులు పాల్గొన్నారు