royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana › జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 ✈ in @ ✉
royalpost.co.in 06 Oct 2026, 10:21 am
Date of Publish : 03 Aug 2026, 6:30 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 36 💬 0
Latest News

జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్…

జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్…

రాయల్ పోస్ట్ న్యూస్ బెంగళూరు, ఆగస్టు 02:
బెంగళూరులో నిర్వహించిన 15వ షోటోఖాన్ జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన జీవీఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ మునీర్ పాషా ఓడరియో కరాటే చీఫ్ రాజశేఖరన్ ట్రోఫీని జివిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి ఎస్ గోపాల్ రెడ్డికి అందజేశారు
ఈ పోటీలలో అకాడమీ నుంచి 24 మంది విద్యార్థులు కటా, కుమితే విభాగాల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. కటా విభాగంలో 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, కుమితే విభాగంలో 23 బంగారు పతకాలు, 1 రజత పతకం సాధించారు. మొత్తంగా 38 బంగారు పతకాలు, 10 రజత పతకాలు గెలుచుకుని తెలంగాణ రాష్ట్రానికి, జీవీఆర్ కరాటే అకాడమీకి జాతీయ స్థాయిలో మరోసారి ఘన విజయాన్ని అందించారని అకాడమీ డైరెక్టర్ డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి తెలిపారు.
పాల్గొన్న విద్యార్థుల వివరాలు
+21 సంవత్సరాల బ్లాక్ సీనియర్ బాలికల బెల్ట్ కేటగిరీలో
జి. అమృత రెడ్డి – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-19 సంవత్సరాల సీనియర్ బాలికల బ్లాక్ బెల్ట్ కేటగిరిలో
జి. గన సంతోషిని రెడ్డి – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-17 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ -70 కేజీల బాలికల క్యాటగిరి
ద్వైత – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-17 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ -60 కేజీల బాలికల
కేటగిరిలో
ఆనగ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-17 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ -55 కేజీల బాలికల
కేటగిరిలో
మహిమా విశాల్ పటేల్ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -75 కేజీల బాలికల
కేటగిరిలో
గౌతమి – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -60 కేజీల బాలికల
కేటగిరిలో
శ్రీత – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -30 కేజీల బాలికల
కేటగిరిలో
అక్షిణి – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -60 కేజీల బాలికల
కేటగిరిలో
శివాని – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -35కేజీల బాలికల
కేటగిరిలో
మౌక్తిక – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-17 సంవత్సరాల కలర్ బెల్ట్ -75 కేజీల బాలికల
కేటగిరిలో
మకాడియా శ్రేయ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల కలర్ బెల్ట్ -50 కేజీల బాలికల
కేటగిరిలో
జునైరా – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల కలర్ బెల్ట్ -40 కేజీల బాలికల
కేటగిరిలో బొల్లం చిన్మయి ప్రియ – కటా: బంగారు పతకం,- కుమితే: బంగారు పతకం
-17 సంవత్సరాల బ్లాక్ బెల్ట్ బాలుర -65 కేటగిరిలో
జి. అవిగ్న వెంకట్ రెడ్డి – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -65 కేజీల బాలుర
కేటగిరిలో
ఒలకుంటి జాన్ ప్రీతం – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-16 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -50 కేజీల బాలుర
కేటగిరిలో
లక్ష్మి నరసింహ– కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ - 55 కేజీల బాలుర
కేటగిరిలో
వన్ష్ – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -50 కేజీల బాలుర
కేటగిరిలో
పృథ్వీరాజ్ పింజారా – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -45 కేజీల బాలుర
కేటగిరిలో
రఘురామ్ – కటా: రజత పతకం, కుమితే: రజత పతకం
-14 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -40 కేజీల బాలుర
కేటగిరిలో
లాకాకుల అన్వీత్ పటేల్ – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం

-12 సంవత్సరాల బ్రౌన్ బెల్ట్ -40 కేజీల బాలుర
కేటగిరిలో
భార్గవ్ – కటా: రజత పతకం, కుమితే: బంగారు పతకం

-16 సంవత్సరాల కలర్ బెల్ట్ -50 కేజీల బాలుర
కేటగిరిలో
ఎం. ఆకాశ్ చౌహాన్ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల కలర్ బెల్ట్ -65 కేజీల బాలుర
కేటగిరిలో
ఆరవ్ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం
-14 సంవత్సరాల కలర్ బెల్ట్ -40 కేజీల బాలుర
కేటగిరిలో
సహర్ష్ – కటా: బంగారు పతకం, కుమితే: బంగారు పతకం

జాతీయ స్థాయిలో తెలంగాణకు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించిన అన్ని క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్ డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి, కోచ్‌లు మరియు తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.