royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaరాజు రాథోడ్ కు ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అవార్డు…. › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 3:24 pm
Date of Publish : 03 Aug 2026, 6:25 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 16 💬 0
Latest News

రాజు రాథోడ్ కు ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అవార్డు….

రాజు రాథోడ్ కు ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అవార్డు….

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 02: ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అవార్డు - 2026ను కాచిగూడ లోని ఎంఎస్ఎస్ లా కాలేజీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రాజు రాథోడ్ అందుకున్నారు. హైదరాబాద్ లక్ష్మీ గార్డెన్స్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాజు రాథోడ్ కు ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ గురువులు డాక్టర్ వి.రవి మాస్టర్, తెలంగాణ షి టీమ్ టెక్నికల్ హెడ్ లక్ష్మీ, మద్ది కన్నన్ గౌడ్ మాస్టర్ లు అందజేశారు. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ సంఘాల గ్రాండ్ మాస్టర్లు, సీనియర్ మాస్టర్లు, కోచ్ లు, ప్రముఖులు రాజు రాథోడ్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే ఇటీవల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచినందుకు గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేశారు.భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
ఈ అవార్డు రాజు రాథోడ్ గారి నిరంతర కృషికి, అంకితభావానికి, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న నిబద్ధతకు లభించిన మరో అరుదైన గౌరవంగా నిలిచింది.