royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaకామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 18 Sep 2026, 5:09 am
Date of Publish : 03 Aug 2026, 6:04 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 34 💬 0
Latest News

కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి….

కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి….

ఈనెల 6వ తేదీన నిర్వహిస్తున్న సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి
- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు

  రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 3/  పీఎం సీనియర్ నాయకులు, రైతు సంఘం మాజీ డివిజన్ కార్యదర్శి, బస్వాపురం గ్రామ్ మాజీ సర్పంచ్ ప్రజా పోరాటాల సారథి అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈనెల 6వ తేదీ బస్వాపురం  గ్రామంలో నిర్వహిస్తున్న స్థూపావిష్కరణ, భారీ బహిరంగ సభలో గ్రామ ప్రజలు మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.

ఆదివారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో అమరజీవి కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారి స్తూప నిర్మాణాన్ని సీపీఎం గ్రామ నాయకత్వం, కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలన చేసిన అనంతరం నర్సింహ మాట్లాడుతూ కామ్రేడ్ రాసాల వెంకటేష్ గారు ఎస్ఎఫ్ఐ సంఘంలో సభ్యునిగా చేరి విద్యార్థి సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొని గ్రామంలో సీపీఎం పార్టీని నిర్మాణం చేయడంలో కీలకపాత్ర పోషించాడని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో గ్రామంలో, మండలంలోని భూమి లేని పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని, ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్వహించిన పోరాటాల్లో ముందుండి పని చేశారని తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన నాటి నుండి ప్రాజెక్టు ప్రజలకు అవసరమనే ఉద్దేశంతో నిర్మాణం జరగాలని సూచనతోపాటు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు, నిర్వాసితులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని అనేక సమరశీల పోరాటాలు నిర్వహించి రైతులకు, నిర్వాసితులకు అండగా నిలిచారని అన్నారు. ప్రజలందరి మద్దతుతో గ్రామ సర్పంచిగా తన భార్యను గెలిపించి గ్రామంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, వీధిలైట్లు, మురికి కాలువలు తోపాటు ప్రతి సమస్యపై ప్రజలను సమీకరించి గ్రామాన్ని అన్ని విధాలుగా సమగ్ర అభివృద్ధిని నిర్వహించి ఉత్తమ గ్రామ పంచాయతీగా మండలంలో బస్వాపురం గ్రామాన్ని తీర్చిదిద్దారని తెలిపారు. కామ్రేడ్ రాసాల వెంకటేష్ అనారోగ్యంతో గత సంవత్సరం ఆగస్టు 6వ తేదీన అమరుడయ్యాడని తెలిపారు. వారు నమ్మిన సిద్ధాంతాన్ని, దోపిడి రహిత సమాజాన్ని, ఎర్రజెండా రాజ్యాన్ని నిర్మించడానికి గ్రామంలో సీపీఎం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆ వెలుగులో అమరజీవి కామ్రేడ్ వెంకటేష్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్థూప ఆవిష్కరణకు, బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ , కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య , రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి. జహంగీర్ గార్లు పాల్గొంటున్నారని, అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులచే నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీధి నాటకోత్సవాలు పల్లె సుద్దులు కూడా ప్రదర్శిస్తున్నారని ఈ బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , మండల కమిటీ సభ్యులు మద్యపురం బాలనర్సింహ, మండల పరిషత్ మాజీ కో- ఆప్షన్ సభ్యులు యండి. బాబు, శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, సహాయ కార్యదర్శి రాసాల దేవేందర్, కుటుంబ సభ్యులు రాసాల శ్రీశైలం , రాసాల శ్రీకాంత్, సీపీఎం మాజీ శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య , ఉడుత వెంకటేష్ , రాసారు శేఖర్,రాసాల బాలమల్లయ్య , బొజ్జ చిన్న వెంకటేష్, సాయులు తదితరులు పాల్గొన్నారు.