రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 29/
భువనగిరి డెవలప్‌మెంట్ ఫోరమ్ (BDF) వ్యవస్థాపకులు, కేంద్ర సెన్సార్ బోర్డు అడ్వైజరీ ప్యానెల్ మెంబర్ మెరుగు మదన్ మోహన్‌ను ఈరోజు ఉదయం వారి గృహంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రం (మెమోరాండం) అందజేశారు.
అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారిపై ఉన్న భువనగిరి 'పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం' వద్దకు విద్యార్థులు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా వెంటనే సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని వారు కోరారు. దాంతో పాటు బచ్చన్నపేట నుండి కొడవటూరు వరకు తీవ్రంగా గుంతలమయమైన 2 కిలోమీటర్ల రోడ్డును త్వరితగతిన పునర్నిర్మించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతులపై మెరుగు మదన్ మోహన్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ రోడ్డు, రోడ్డు పునర్నిర్మాణ పనులు త్వరలోనే పూర్తయ్యేలా తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.