royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవీర్ జవాన్ దేశ సేవారత్న 2026 జాతీయ అవార్డు అందుకున్న… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 01 Aug 2026, 1:25 pm
Date of Publish : 27 Jul 2026, 8:59 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 9 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

వీర్ జవాన్ దేశ సేవారత్న 2026 జాతీయ అవార్డు అందుకున్న ప్రసాద్ ముదిరాజ్

వీర్ జవాన్ దేశ సేవారత్న 2026 జాతీయ అవార్డు అందుకున్న ప్రసాద్ ముదిరాజ్

రాయల్ పోస్ట్ న్యూస్ ఆలేరు జులై 26/ కార్గిల్ లో భారత జవానులు వీరమరణం పొందారు వారి సేవకు,అంకితభావానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశం కోసం త్యాగం చేసిన జవానులకు మదర్ థెరిసా ఫౌండేషన్ వారు "వీర్ జవాన్ దేశ సేవారత్న 2026 జాతీయ అవార్డు" లను ప్రధానం చేయడం జరుగుతుంది.సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ద్వారా పోలీసు ఉద్యోగం చేస్తూనే గ్రామీణ ప్రాంతాల నుండి దేశానికి సైనికులను తయారు చేస్తున్న సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ సంస్థ ఫౌండర్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్ ముదిరాజ్ గారికి ఈ అవార్డును ప్రధానం చేశారు.ఈ జాతీయ అవార్డు ఆర్మీ జవానులకు మాత్రమే అందజేస్తారు కానీ తెలంగాణ పోలీసుగా ఉండి కూడా దేశానికి సైనికులను తయారు చేస్తున్నందుకు గాను ఈ అవార్డును ప్రధానం చేశారు అని ప్రసాద్ ముదిరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు,పోలీసు అధికారులు,రాజకీయ నాయకులు ప్రసాద్ ను అభినందించారు.