royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవర్షం కోసం బోడ్రాయికి జలాభిషేకం..! › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 18 Sep 2026, 4:06 am
Date of Publish : 27 Jul 2026, 8:51 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 24 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

వర్షం కోసం బోడ్రాయికి జలాభిషేకం..!

వర్షం కోసం బోడ్రాయికి జలాభిషేకం..!

వర్షాలు కురవాలని భక్తిశ్రద్ధలతో బొడ్రాయికి శివునికి మహిళలతో నీళ్లు పోసిప్రత్యేక పూజలు
బర్రె పూజిత కౌన్సిలర్ - జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్…

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 26/ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, చెరువులు నిండి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ భువనగిరి మున్సిపల్ పట్టణంలో ఆదివారం సంప్రదాయ పద్ధతిలో బోడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు.
23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్, 24 వ కౌన్సిలర్ చల్లగురుల కృష్ణవేణి రఘుబాబు వార్డుకు చెందిన మహిళలు బిందెలలో మంచినీటిని తీసుకొచ్చి బోడ్రాయిపై పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాన్ని పాటిస్తూ వానదేవుడిని ప్రార్థించి, త్వరలోనే విస్తారంగా వర్షాలు కురవాలని మొక్కుకున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ మాట్లాడుతూ, "ప్రజలు, రైతులంతా వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించాం" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రత్నపురం పద్మ,పబ్బతి హరికృష్ణ గౌడ్, గుండెబోయిన సురేష్ యాదవ్, G పావని,మణెమ్మ,శంకరమ్మ, బాలమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.