రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 26: ఆగస్టు 2, 2026న బెంగళూరులో నిర్వహించనున్న 15వ జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్లో పాల్గొననున్న జివిఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు అవిజ్ఞ వెంకట్ రెడ్డి మరియు అన్విత్ పటేల్లకు ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ కృష్ణారెడ్డి ఆర్థిక సహాయాన్ని (స్పాన్సర్‌షిప్) అందించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హిమాయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి తెలంగాణకు, అకాడమీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జివిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించిన డాక్టర్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహం క్రీడాకారుల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అకాడమీ బ్లాక్ బెల్ట్‌లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని, జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ విజయవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.