విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్, ఎస్.పి, డి. శ్రీనివాస్
క్షేత్రస్థాయి దాతృత్వంలో వైశ్యులు ఎల్లప్పుడు ముందుండాలి...
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ కుమార్
ఘనంగా గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ప్రథమ వార్షికోత్సవం
రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 20: భారత దేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి వ్యాపారులుగా, వర్తకులుగా గొప్ప గుర్తింపు పొందిన , వైశ్యులు దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడంలో మరింత కీలక పాత్ర పోషించాలని విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంట్, ఎస్.పి, డి. శ్రీనివాస్ కోరారు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ (జీవీబీఎల్) ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవ సభకు జీవీబీఎల్ వ్యవస్థాపకులు, సిఈఓ రాజశేఖర్ మంచీ అధ్యక్షత వహించగా డి. శ్రీనివాస్, చికోటి ప్రవీణ్ కుమార్, కెపిసి ప్రాజెక్ట్స్ సిఏండి కె. అనిల్ కుమార్, సుధాకర్ పివిసి డైరెక్టర్ మీలా జయదేవ్ ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా డి. శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజం యొక్క సామాజిక, ఆర్థిక స్థితిని ఉన్నతీకరించడం, హక్కులను పరిరక్షించడం, మరియు నైతిక, మేధో, వాణిజ్య, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రయోజనాలను ప్రోత్సహించడం వంటి లక్ష్యంతో పనిచేయాలన్నారు. చికోటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే గుణం, అంకితభావం, వ్యవస్థాపక స్ఫూర్తి,
వ్యాపార చతురతకు నిదర్శనంగా వైశ్యులు భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ దేశ జీడీపీ వృద్ధికి కూడా దోహదపడుతున్నారని తెలిపారు కేవలం లాభాలు సంపాదించడమే కాకుండా, తమ వ్యాపార ప్రయత్నాల ద్వారా అధికారాన్ని, సామాజిక హోదాను కూడా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటూ క్షేత్రస్థాయి దాతృత్వంలో వైశ్యులు ఎల్లప్పుడు ముందుండాలని కోరారు. రాజశేఖర్ మంచీ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటును అందించడం కోసం వైశ్యులు కలిసి ఎదగడం, ఒకరి పరిచయాలు మరియు నెట్‌వర్క్‌ల నుండి ప్రయోజనం పొందడం, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా బలమైన వ్యాపారవేత్తలుగా, వ్యవస్థాపకులుగా ఎదగడం అనే లక్ష్యంతో జీవీబీఎల్ ప్రారంభించబడిందని తెలిపారు. సాంప్రదాయ వ్యాపారాలను ఆధునిక కార్పొరేట్ సంస్థలుగా విస్తరించడం, నూతన ఆధునిక పరిశ్రమలు, వర్ధమాన స్టార్టప్‌లను ప్రోత్సహించడం, జాయింట్ వెంచర్లు, మరియు కమ్యూనిటీ వ్యాపార అభివృద్ధికి జీవీబీఎల్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సభలో జీవీబీఎల్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్, ఉపాధ్యక్షులు టీ. క్రాంతి, బి. సంతోష్, టి. శివ, జి. శ్రీనివాస్, జి. నిఖిల్, కె. భారత్ కుమార్, కార్యదర్శి రవి కొండూరి, కోశాధికారి సి. తరుణ్, కార్యవర్గ సభ్యులు కె. వేణు, ఆర్. ప్రసాద్, కృష్ణ మోహన్ గుప్తా తోపాటు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల 14 చాఫ్టర్ల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.