రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 20/ ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్‌కు నూతన భవనం నిర్మాణం కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కు బర్రె జహంగీర్ భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్, తాహెరా - బాబ్లు కౌన్సిలర్ లు వినతిపత్రం సమర్పించారు.
భువనగిరి పట్టణంలోని ఖాజీమొహల్లా వీధిలో సర్వే నంబర్–6లో ఉన్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో, 2019–20 విద్యా సంవత్సరం నుంచి హాస్టల్‌లోని 145 మంది విద్యార్థినులను ప్రైవేట్ భవనానికి తరలించి అక్కడే వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్ కూడా అదే ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది.
శిథిలమైన పాత హాస్టల్ ఉన్న ఎకరం విస్తీర్ణం ప్రభుత్వ స్థలంలోనే కొత్త భవనం నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
భువనగిరి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ఉన్నత విద్య కోసం వచ్చే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికలకు ఈ హాస్టల్ ఎంతో అవసరమని, విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత భవనంలో తగిన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
అందువల్ల భువనగిరి పట్టణంలోని సర్వే నంబర్–6లోని ప్రభుత్వ స్థలంలో నూతన ప్రభుత్వ ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్ భవన నిర్మాణం చేపట్టేందుకు రూ.3 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రినిబర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు 8వ వార్డ్ కౌన్సిలర్ తాహెరా - బబ్లు కోరారు ఆయన వెంట కోఆప్షన్ సభ్యులు సుజాత్ అలీ కౌసర్, యోజన కాంగ్రెస్ నాయకులు రంగ శ్యామ్ గౌడ్ ఉన్నారు.