royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఘనంగా ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 10:32 pm
Date of Publish : 20 Jul 2026, 6:43 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 0
Latest News > తెలంగాణ > హైదరాబాద్

ఘనంగా ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 19: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్. లక్ష్మణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం అంబర్ పేట్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు . ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. హనుమంతరావు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా లక్ష్మణ్ యాదవ్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి భారీ కేక్ కట్ చేయించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ:. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్. లక్ష్మణ్ యాదవ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముందుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో లక్ష్మణ్ యాదవ్ మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఆర్. లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ:
తన పుట్టినరోజు సందర్భంగా విచ్చేసి ఆశీస్సులు అందించిన పెద్దలు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ, దిలీప్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.